Monday, 7 September 2026

*రాష్ట్రంలో పెన్షన్ల పండుగ ప్రారంభం

 రాష్ట్రంలో పెన్షన్ల పండుగ ప్రారంభం 
మూడు లక్షల కొత్త పింఛన్లకు దరఖాస్తులు 
నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ 
- టిడిపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ల పండగ ప్రారంభమైందని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 62 లక్షలు మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందిస్తుండగా మళ్లీ మూడు లక్షల కొత్త పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభమైందని అన్నారు.

 ఇప్పటివరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో  ఇవ్వని విధంగా అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా పేరు పొందని అన్నారు. రాష్ట్రలో ప్రతినెల 2694 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్  ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 73,508 కోట్లు కేవలం పెన్షన్లకి అందించిన  చరిత్ర కూటమి ప్రభుత్వంది అని అన్నారు.  వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, డప్పు కళాకారులకు, చర్మకారులకు, కల్లుగీత కార్మికులకు ట్రాన్స్జెండ్ లకు పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అని కొనియాడారు. అన్ని వర్గాలు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం అనేది ఒక తంతుగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నారు అని అన్నారు. గ్రామ ప్రజలు అందరూ కూడా తమ తమ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని అర్హతలు ఉండి పెన్షన్ లేని వారు ఈ రాష్ట్రంలో ఉండకూడదని లక్ష్యంతో మంత్రి పని చేస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర జనాభాలో 13 శాతం మందికి సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గణతకి ఎక్కిందని అన్నారు. ఈ యొక్క ప్రెస్మీట్లో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ,పూతలపట్టు నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు వినోద్ కుమార్, తెలుగు రైతు కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

వసంత్ కుమార్ కు స్టేట్ అవార్డు

 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా వసంత్ కుమార్ 
ఉపాధ్యాయ దినోత్సవం రోజు అవార్డుల ప్రధానం 
ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అధ్యాపకులు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :




చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీ వి. వసంత కుమార్ గారికి విద్యారంగంలో విశేష సేవలు, అకడమిక్ ఎక్సలెన్స్, విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ తెలిపారు.


శ్రీ వి. వసంత కుమార్ గారు బోటనీ జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1996లో స్కూల్ అసిస్టెంట్గా ప్రభుత్వ విద్యాశాఖలో సేవలను ప్రారంభించి, 2002లో జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొందారు. అప్పటి నుండి బోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.


విద్యార్థుల అకడమిక్ ప్రగతికి మార్గదర్శకత్వం, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ, అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కెరీర్ గైడెన్స్ మెంటర్గా పనిచేస్తూ ఉన్నత విద్య, పోటీ పరీక్షలు మరియు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.



ఇంటర్మీడియట్ విద్యలో చిత్తూరు జిల్లాలో NEET సంస్కరణల అమలుకు సంబంధించి రిసోర్స్ పర్సన్గా పనిచేసి, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే బోర్డు విద్యా సంస్కరణలకు అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శకత్వం అందిస్తూ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను సమర్థవంతంగా అమలు చేయడంలో కృషి చేశారు.


సామాజిక బాధ్యతలో భాగంగా ఈగల్ క్లబ్ సభ్యునిగా మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా సేవలందించారు. NSS ద్వారా వృక్షారోపణ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య మరియు సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు.


విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకత్వం, సామాజిక సేవ మరియు విద్యా సంస్కరణల అమలులో ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలి*

 *కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలి* 

*ఈవిటీజింగ్ అరికట్టాలి* 

*కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ వినతి* 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

వేము కాలేజీ వద్ద మరియు ఐరాల మండలంలో స్కూలు కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని,  అలాగే జీడి నెల్లూరు మండల కేంద్రంలో బస్ స్టాప్లవద్ద అమ్మాయిలపై ఈవిటీజింగ్ జరుగుతున్నదని వీటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 




ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్, మసూద్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు లు కలెక్టర్ కి వివరిస్తూ  తిరుపతి రోడ్డులోని వేము కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలేజీకి వెళ్లే సమయంలోను కాలేజీ  వదిలిన తర్వాత చిత్తూర్ కి వచ్చే సందర్భంలో బస్సులు ఆపడం లేదన్నారు. ఇటు కాలేజీ యాజమాన్యం పట్టించుకోక  అటు ఆర్టీసీ బస్సులు ఆగక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఐరాల మండలంలో స్కూలు వదిలే సమయానికి వచ్చే బస్సు సమయం మార్చి 6 గంటల పైన రావడంతో విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ వదిలే సమయానికి గతంలో లాగా నడపాలని కోరారు.


   జిడి నెల్లూరు మండలం వెల్కూరు నుండి యలమరాజపురం వెళ్ళే దారిలో బట్టు కండ్రిగ అనే గ్రామం లో సాయంత్రం 5:30 నుండి 7:00 వరకు విద్యార్థునులు మరియి మహిళల లకు భద్రత కలిపించాలని ,ఈవి టీజింగ్  చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మోహన్,సాయి ప్రసాద్ పాల్గొన్నారు.

స్పందించిన కలెక్టర్*

        ఎస్ఎఫ్ఐ తెలిపిన ఫిర్యాదులు ప్రకారం వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఈవీటీజింగ్ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు సౌకర్యార్థం బస్సులు నిలుపుదల చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ గుర్తు చేయండి అని ఎస్ఎఫ్ఐ నాయకులకు కలెక్టర్ తెలియజేశారు వెంటనే స్పందించిన కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ అభినందనలు తెలుపుతున్నది.

బంగారుపాళ్యం మండల ప్రజలకి విజ్ఞప్తి*

*బంగారుపాళ్యం మండల ప్రజలకి విజ్ఞప్తి*
వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతులు పూర్తిగా ఉచితం – సింగిల్ విండో విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి .
- బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు
 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా మంటపాల ఏర్పాటుకు *“ganeshutsav.net”* ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.*


ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించినది.


ప్రజలు *“ganeshutsav.net”* అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తును, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.


*దరఖాస్తు  విధానం:*


✅ మొదటగా దరఖాస్తు చేయదలచిన వారు *“ganeshutsav.net”* Website open చేసి New application అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.


✅ తరువాత దరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలయును. తరువాత సదరు మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయవలయును.


✅ ఆ తరువాత దరఖాస్తు దారుని పేరు, అడ్రస్ మరియు కమిటి సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, , విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవలయును.


✅ అప్పుడు Application ID No. (Unique ID) Generate చేయబడి, సదరు దరఖాస్తు పోలీస్ శాఖ యొక్క అనుమతి కోసం వారి logins కు వెళుతుంది. 


✅ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అనుమతించిన తరువాత ఆ వివరాలు website నందు వచ్చును. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. 


✅ అనుమతికి సంభందించిన QR Code మరియు నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలను తెలిపే ఒక BOOKLET DOWNLOAD అగును.


*నిర్వాహకులు నిరభ్యంతర పత్రం (NOC) మరియు నియమ నిబంధనలు కూడిన పత్రాలను ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. పోలీసువారు సందర్శన సమయములో QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.*


శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రమాదాలు మరియు ఘర్షణలకు తావులేకుండా పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసు శాఖకు ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుచున్నాము 


Sunday, 6 September 2026

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

 ఓలో రాపిడో వ్యవస్థను రద్దు చేయాలి 
ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల ఆర్థిక స్థితి కుదేలు 
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి 
_సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్
 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాపిడో ఓలో వంటి సంస్థలు విరివిగా రావడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత అద్వానంగా తయారైంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోనే ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి సగం కుదేలైందని, ఇప్పుడు ఓలో రాపిడో వంటి సంస్థలు పుట్టగొడుగుల్లా రావడంతో ఆటో డ్రైవర్ల మనుగడ ప్రమాదకరంగా మారిందన్నారు. ఆర్థికంగా పూర్తిగా క్షీణించిపోయి కుటుంబం నడివీధిన పాలై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలని ఓలో రాపిడో వంటి సంస్థలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

కళ్ళల్లో కారంపొడి చల్లి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆ ..ముగ్గురు....!

 కళ్ళల్లో కారంపొడి చల్లి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన 
ఆ ..ముగ్గురు....!
వ్యక్తిగత కారణాలే ఈ ఘాతకానికి కారణం !
కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 




    కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నరసమ్మ (30) పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇటీవల భర్త మరణించాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 5.30 లకు బస్టాండ్ వద్ద చెత్త ఊడుస్తూ ఉండగా ఉన్నపలంగా స్కూటీలో ఇద్దరు మహిళలు మరో బైక్ మీద ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి కళ్ళల్లో కారంపొడి చల్లి, ఆమె కళ్ళు తెరవ లేక విలవిలలాడుతూ ఉండగా ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అక్కడనుండి పరారైనారు. తోటి పారిశుద్ధ్య కార్మికురాలు గమనించి తన చీరతో ఆ మంటలను ఆర్పగా అప్పటికే 80% ఆమె శరీర భాగాలు కాలిపోయింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. 


ప్రాథమిక నిర్ధారణ :


         నరసమ్మకు , చిన్న ఈరన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జూలై 26 న చిన్న ఈరన్న ఇంట్లోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య శిరీష నరసమ్మ పైన పగబట్టింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో తన స్నేహితురాలు మరో వ్యక్తితో కలిసి ఆదివారం ఉదయం ఈ ఘాతకానికి పాల్పడింది.

వసంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

 మాజీ దివంగత కార్పోరేటర్ వసంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ 
కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది 
అన్ని విధాలుగా ఆదుకుంటాం 
- నారా లోకేష్ 
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

వసంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్


దివంగత మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అజాతశత్రువుగా పేరుపొందిన వసంత్ కుమార్ గత నెల ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెద్దకాల్వ గ్రామానికి చెందిన వసంత్ కుమార్ చిన్న వయలోనే తెలుగుదేశం పార్టీలో చేరి యువసేన పదవులతో పాటు పలు పదవులు అలంకరించి పార్టీ కోసం వినలేని సేవలు చేశారు. ఇటీవల చూడ చైర్పర్సన్ గా నామినేటెడ్ పదవి తనను వరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ అదే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు రెండు నెలల పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిరునవ్వుతో ప్రజలను పలకరిస్తూ అందర్నీ కలుపుకొని అజాతశత్రువుగా ఎదిగారు. గత నెల బెంగళూరులోని ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మరణ వార్త విని ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి విశేష సంఖ్యలో అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన పార్టీవ దేహాన్ని చూడడానికి చివరి చూపుగా వచ్చారు. ఆయన మరణం తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్థివ దేహాన్ని చిత్తూరు నుండి గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెద్దకల్వ స్వగృహం వరకు ఊరేగింపుగా వెళ్లి.. అనంతరం కర్మ క్రియలు నిర్వహించారు. అప్పుడే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వసంత్ కుమార్ సతీమణిని ఫోన్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. 

వసంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్: 
  
 సెప్టెంబర్  6వ తేదీన  పెద్ద కాల్వ స్వగ్రామంలో వసంత్ కుమార్ కర్మకాండక్రియల.. అనంతరం... మహాదేవనాయుడు కాలనీలోని వసంత్ కుమార్ స్వగృహంలో ఆయన భార్య శిల్ప కూతురిని  విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక పసుపు సైనికున్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.